France : ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వచ్చే నెలలో ఫ్రాన్స్ (France) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పారిస్లో కృత్రిమ మేధ (ఏఐ) మీద నిర్వహించే సదస్సులోనూ పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ (Emmanuel Macron) ఈ విషయాన్ని వెల్లడిరచారు. భారత ప్రధాని మోదీ మా దేశానికి అధికారిక పర్యటన నిమిత్తం రాబోతున్నారు. అదే సమయంలో 11, 12 తేదీల్లో నిర్వహించే ఏఐ సదస్సు (AI Conference )లో పాల్గొంటారు. ఈ వేదికపై అమెరికా, చైనా, భారత్ సహా శక్తిమంతమైన దేశాలతో కీలక చర్చలు జరపనున్నాం అని మెక్రాన్ తెలిపారు.






