Narendra Modi : ప్రధాని మోదీని ఆహ్వానించిన రష్యా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ (Victory Day Parade) వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్ (Kremlin) ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో (Andrey Rudenko ) వెల్లడిరచారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. జర్మనీ (Germany) పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్బంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపింది. విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు.






