Bumrah: కెప్టెన్సి ఇచ్చి బంగారు బాతును చంపవద్దు..!

టీం ఇండియా సారధ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకోవడం సరైనదే అయినా.. ఆ స్థానానికి జస్ప్రీత్ బుమ్రా (Bumrah) ఎంపిక చేయాలనుకుంటే మాత్రం సరైన నిర్ణయం కాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. అతను భారత ప్రధాన స్ట్రైక్ బౌలర్ అని.. అతను గాయాలకు బారిన పడే అవకాశం ఉందని.. ఎప్పటికప్పుడు విరామం అవసరమని అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ (Rohith Sharma) తన బ్యాట్‌తో పేలవమైన ఫామ్ తో సిడ్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) చివరి టెస్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు.
మొదటి టెస్ట్ లో కూడా బూమ్రా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. భారత కెప్టెన్‌గా తప్పుకునే ఆలోచనగాని.. ఆటగాడిగా క్రికెట్ నుంచి వైదొలగే ఉద్దేశం లేదని రోహిత్ తర్వాత స్పష్టం చేసినప్పటికీ, అతని ప్రదర్శన చూసిన బోర్డ్ మాత్రం తప్పించాలనే ఆలోచనలోనే ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. బూమ్రాకు కెప్టెన్సి ఇస్తే బంగారు బాతును చంపినట్టే అని కైఫ్ హెచ్చరించాడు. బుమ్రాను ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమించే ముందు బీసీసీఐ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించాడు.
అతని ప్రదర్శనపై, ఫిట్నెస్ పై మాత్రమే దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. అతను ఒక్కడే బౌలర్. అతను ప్రతి మ్యాచ్‌లో రాణించాలనే ఒత్తిడిలో ఉన్నాడన్న కైఫ్.. ఆస్ట్రేలియాలో అతనికి సరైన మద్దతు లభించలేదు అన్నాడు. షమీ అక్కడ లేడు అని.. సిరాజ్ ఫామ్‌లో లేడు అని.. కాబట్టి మ్యాచ్‌లు గెలవాలనే ఒత్తిడితో అతను బౌలింగ్ చేసినట్టు పేర్కొన్నాడు. కెప్టెన్ గా బ్యాట్స్మెన్ నే తీసుకోవాలని సూచించాడు. కెఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ పెర్లన్ను పరిశీలించాలని.. కెప్టెన్లుగా చేసిన అనుభవం ఉంది కాబట్టి వారి పేర్లను పరిశీలించాలని అభిప్రాయపడ్డాడు.