Miss World: ఈ దేశానికి చాలా ప్రాధాన్యత : మిస్ వరల్డ్ క్రిస్టినా
భారత్లో తనకు చాలా గొప్పగా స్వాగతం పలికారని, తన హృదయంలో ఈ దేశానికి చాలా ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ (Miss World) క్రిస్టినా పిస్కోవా (Christina Piskova) అన్నారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత సంస్కృతి(Indian culture) , కళలు చాలా గొప్పగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ స్ఫూర్తి లభిస్తోందని, విలువలు బోధిస్తారని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఎంతో గొప్ప భావన అని పేర్కొన్నారు. ఎన్నో భాషలు ఉన్నా అంతా ఒక్కటిగా ఉండటం భారత్ స్ఫూర్తి. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని క్రిస్టినా పిస్కోవా అన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ (Telangana )వేదిక కానుంది. మే నెలలో హైదరాబాద్ (Hyderabad)లో పోటీలు ప్రారంభం కానున్నాయి.






