Bill Gates: బిల్ గేట్స్‌కు ఊహించని షాక్.. మైక్రోసాఫ్ట్ గోల్డెన్ జూబ్లీలో
గాజాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సైన్యానికి ఏఐ సాంకేతికతను అందించడం మానుకోవాలంటూ మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates )సమక్షంలోనే ఆ సంస్థ ఉద్యోగులు నిరసన తెలిపారు. మైక్రోసాఫ్ట్ 50 వసంతాల సందర్భంగా ఆ సంస్థ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ (Mustafa Suleiman) ప్రజేంటేషన్ ఇస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఇబ్తిహాల్ అబూసాద్ లేచి ముస్తఫా ఏఐను మంచి కోసం ఉపయోగిస్తామన్నారు. కానీ ఇజ్రాయెల్ (Israel సైన్యానికి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు గాజాలో 50వేల మంది మరణించారు. ఇది ఆపేయండి అని గట్గిగా కేకలు వేశారు. ఆమెను బయటకు పంపివేస్తుండగా స్కార్ప్ ను ఆమె వేదిక పైకి విసిరేశారు. తర్వాత గేట్స్ సత్యనాదెళ్ల (Satyanadella )వేదికపై ఉండగా, మరో ఉద్యోగిని వనియా అగర్వాల్ సైతం నిరసన తెలిపారు.







