Zuckerberg :భారత్ కు మెటా క్షమాపణలు
ఎన్నికలపై ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ (Zuckerberg) చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌కు మెటా (Meta) సంస్థ క్షమాపణలు చెప్పింది. దీంతో వివాదం ముగిసిందని ఐటీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే (Nishikant Dubey )తెలిపారు. ఇది భారత ప్రజల విజయమన్నారు. మెటా సంస్థ సీఈఓ జుకర్‌బర్గ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కోవిడ్‌ను ఎదుర్కోవడంలో విఫలమైన అధికార పార్టీలన్నీ 2024 ఎన్నికల్లో ఓడిపోయాయని వ్యాఖ్యానించడం, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Nishikant Dubey) వాటిని ఖండిరచడం తెలిసిందే. మెటాకు సమన్లు జారీ చేయనున్నట్లు దూబే తెలిపారు. దాంతో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ (Shivnath Thukral ) క్షమాపణ చెప్పారు.






