Kremlin :అలా అయితేనే చర్చలు : క్రెమ్లిన్
మూడేళ్ల కాలంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్దాన్ని ముగించేలా ఒప్పందానికి రష్యా ముందుకు రాకపోతే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తానని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. దీనిపై తాజాగా పుతిన్ (Putin) ప్రభుత్వం స్పందించింది. ఆ మాటల్లో కొత్తేం లేదని అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ (Dmitry Peskov) అన్నారు. అలాగే పుతిన్‌తో తాను చర్చలకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడిరచిన సంగతి తెలిసిందే. దీనిపై పెస్కోవ్ స్పందిస్తూ.. పరస్పర గౌరవప్రదమైన చర్చలకు సిద్ధంగా ఉన్నాం. అందుకు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నాం. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు అని బదులిచ్చారు.






