ఇజ్రాయెల్ కు బైడెన్ హెచ్చరిక.. రఫాపై దాడి చేస్తే
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. గాజాలోని ఈ నగరంపై దాడి చేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్‌కు తెలిపింది. ఈ విషయాన్ని తాను ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకూ స్పష్టం చేశానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్ సెప్టర్లను, ఇతర రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తాం. రఫాపైకి పోతే మాత్రం ఆయుధాలను, ఫిరంగి గుళ్లను పంపించం అని తెలిపారు. విధ్వంసం సృష్టించే భారీ బాంబుల సరఫరాను ఇప్పటికే అమెరికా నిలిపివేసిన సంగతి తెలిసిందే.






