USA: అమెరికా అధ్యక్షులైన ఐదుగురు ఒక చోట… జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో అరుదైన దృశ్యం
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(jimmy carter) అంత్యక్రియలకు ప్రస్తుతం జీవించి ఉన్న అమెరికా అధ్యక్షులు అందరూ వచ్చారు. ఈ ఐదుగురు లీడర్లు కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. అలాంటి దృశ్యమే జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో కనిపించింది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్.. ఐదుగురు నేతలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా జీవించి ఉన్న అమెరికా అధ్యక్షులంతా కలిసి కనిపించడం 2018 తర్వాత ఇదే తొలిసారి. 2018లో జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ మరణించినప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. అప్పుడు జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్ అంత్యక్రియలకు జిమ్మీ కార్టర్ దంపతులు కూడా హాజరయ్యారు.






