Jeff Bezos : అంతరిక్ష రంగంలోకి జెఫ్ బెజోస్
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్(Jeff Bezos )నేతృత్వంలోని బ్లూ ఆరిజిన్ సంస్థ, తమ తొలి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగానికి (Rocket launch )సిద్ధమవుతోంది. న్యూ గ్లెన్ గా పేరు పెట్టిన ఈ 320 అడుగుల రాకెట్ ప్రయోగం ఈ నెల 8న ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి జరగనుంది. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk ) కు చెందిన స్పేస్ ఎక్స్ (Space X ) తో, రెండోస్థానంలో బెజోస్ సంస్థ అంతరిక్ష రంగంలోనూ పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. ప్రైవేటు సంస్థల అంతరిక్ష వాణిజ్యంలో ప్రస్తుతం స్పేస్ఎక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. న్యూ గ్లెన్ ప్రయోగం విజయవంతమైతే, ఈ రంగంలో దిగ్గజ సంస్థలు మరింత వినూత్నతకు పెద్దపీట వేయం ఖాయమే.






