Jaishankar : భారత్‌కు ట్రంప్ మిత్రుడా..?శత్రువా..?: జైశంకర్ సమాధానమిదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను జాతీయవాది అని విదేశీ వ్యవహారల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S. Jaishankar) అభివర్ణించారు. ఢల్లీి యూనివర్సిటీకి చెందిన హన్సరాజ్ కాలేజ్ (Hansraj College )లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ట్రంప్(Trump) ప్రమాణస్వీకార కార్యక్రమానికి నేను హాజరయ్యాను. మనకు ఎంతో గౌరవం లభించింది. ఆయనొక జాతీయవాది అని నేను విశ్వసిస్తున్నాను అని జై శంకర్ అన్నారు. ట్రంప్ భారత్‌కు మిత్రుడా? శత్రువా? అని అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. ట్రంప్ విధానాలతో ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశాలున్నప్పటికీ భారత్ మాత్రం దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. అమెరికా (America)తో మన బంధం బలంగా ఉంది. ప్రధాని మోదీ (Prime Minister Modi )కి ట్రంప్‌తో మంచి స్నేహముంది అని వెల్లడిరచారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రభావం పెరుగుతోందన్నారు. అలాగే మంత్రి తన కెరీర్ గురించి మాట్లాడారు. నేను ఒక బ్యూరోక్రాట్‌ను. నా రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. అది అదృష్టమే అనుకోండి. అదంతా మోదీజీ వల్లే. నో అని చెప్ప లేని విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చేలా ఆయన ప్రోత్సహించారు అని గుర్తు చేసుకున్నారు.