Melinda Gates :జీవితంలో అది అత్యంత బాధాకరమైన విషయం : మెలిందా గేట్స్
మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో విడాకుల పై మెలిందా గేట్స్ (Melinda Gates) తాజాగా స్పందించారు. బిల్ గేట్స్ (Bill Gates) తో విడిపోవడాన్ని చాలా అవసరం అని అభివర్ణించారు. ఈ సందర్భంగా మెలిందా మీడియాతో మాట్లాడుతూ అత్యంత సన్నిహిత సంబంధంలో మీ విలువలను నిలబెట్టుకోలేకపోతే విడాకులు (Divorce) అవసరమే అని వ్యాఖ్యానించారు. వివాహ బంధాన్ని ముగించడం చాలా చాలా కష్టం. విడిపోవాల్సిన అవసరం అప్పడు ఏర్పడిరది. జీవితంలో అది అత్యంత బాధాకరమైన విషయం . ఆ సమయంలో ఎంతో భయాందోళనకు గురయ్యాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మెలిందా తెలిపారు.







