Israel : అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ (Israel) ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఈ మేరకు ప్రకటించారు. అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్‌ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్‌కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికా (America) ల సంబందాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుందని నెతన్యాహూ ప్రకటించారు.






