America: కుమారుడిని కడతేర్చిన భారత సంతతి మహిళ!
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన సరితా రామరాజు (Saritha Ramaraju) (48) తన 11 ఏళ్ల కుమారుడిని గొంతుకోసి దారుణంగా హతమార్చింది. సరితా రామరాజు 2018లో భర్త ప్రకాశ్ రాజు (Prakash Raju) నుంచి విడిపోయారు. ఆ దంపతుల కుమారుడి బాధ్యతలను కోర్టు (Court) భర్తకు అప్పగించింది. తల్లికి అప్పుడప్పుడు కలిసే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం ఆమె వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో ఉంటోంది. ఇటీవల తన కుమారుడిని చూసుకునేందుకు కాలిఫోర్నియాలోని శాంటా అనాలో ఓ హోటల్లో రూమ్ తీసుకుంది. కుమారుడితో సరదాగా గడిపేందుకు డిస్నీల్యాండ్(Disneyland) లో పాస్‌లను సైతం కొనుగోలు చేసింది. ఈ నెల 19న తన బాబుని తిరిగి తండ్రికి అప్పగించాల్సి ఉంది. అయితే అది సరితకు ఇష్టం లేదు. ఈ నేపథ్యలో అదే రోజు ఉదయం 9:12 గంటలకు పోలీసులకు ఫోన్ చేసి తాను కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకునేందుకు నిద్ర మాత్రలు మింగానని తెలిపింది.






