America: అమెరికాలో విషాద ఘటన… భారత సంతతి ఇంజినీర్ సహా
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ (Washington) రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డి (Vishnu Irigireddy) సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.
సియాటెల్ (Seattle)లోని ప్రముఖ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సియాటెల్‌కు చెందిన విష్ణు (48) మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పర్వతారోహణ కోసం నార్త్ ఎర్లీ వింటర్స్ స్పియర్స్ ప్రాంతానికి వెళ్లారు. దిగే సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురయ్యింది. ఈ క్రమంలో వారి యాంకర్ పాయింట్ అదుపుతప్పి 200 అడుగుల లోతులో పడిపోయారు. అందులో ప్రాణాలతో ఉన్న ఓ యువకుడు మాత్రం 64 కి.మీ. నడిచి ఎట్టకేలకు సురక్షిత ప్రాంతానికి చేరుకొన్నాడు. ప్రమాద విషయాన్ని అధికారులకు వెల్లడిరచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్య్కూ బృందాలు హెలికాప్టర్ (Helicopter) సాయంతో మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. భారత్‌కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్‌లో స్థిరపడ్డారు. గ్రేటర్ సియాటెల్‌లో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ పేరుగాంచిన నిపుణుల్లో ఒకడిగా గుర్తింపు పొందడంతోపాటు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరించేవారు.







