Chandrababu: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత : చంద్రబాబు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు, మంత్రి లోకేశ్ (Minister Lokesh) దిశానిర్దేశం చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, విభజన హామీల అమలు, విద్య, వైద్య, జాతీయ రహదారుల గురించి ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి విషయంలో ఆయా శాఖల కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులను నిరంతరం సంప్రదించాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. రాష్ట్రానికి ఇంకా ఏం సాధించవచ్చనే అంశంపై నిరంతరం ఆలోచిస్తూ కేంద్రం నుంచి నిధులు సాధించాలన్నారు. ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం (Polavaram), నల్లమలసాగర్లను ప్రాధాన్యాంశాలుగా తీసుకొని ప్రస్తావించాలన్నారు. ఎంపీలంతా పొత్తు ధర్మం పాటించాలని సూచించారు. రాబోయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు జనసే, బీజేపీ ఎంపీలనూ ఆహ్వానించాలని నిర్ణయించారు. టీడీపీ ఎప్పుడు పొత్తులో ఉన్నా కూటమి ఐక్యతను కాపాడుతుంది. కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించొద్దు. మీ దష్టి కేంద్ర పథకాలపై ఉండాలి. వాటిని సాధించాలన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






