Republic Day: అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day celebrations) ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer) ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్లో పాల్గొన్న 11 దశాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రగతిని చాటేలా 22 శకటాలను ప్రదర్శించారు. గణతంత్ర వేడుకలను చూసేందుకు రాజధాని ప్రాంత రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






