Amaravati: అమరావతిలో తొలిసారిగా… మువ్వన్నెల పండగ
రాజధాని అమరావతి (Amaravati) గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. రాయపూడి సమీపంలో సీడ్‌యాక్సెస్ రహదారి పక్కనున్న ఎమ్మెల్యే భవన సముదాయాల నుంచి హైకోర్టు (High Court)కు వెళ్లే మార్గంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు (Republic Day celebrations) నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వేదికకు వెళ్లే మార్గాల్లో త్రివర్ణ పతకాలు కనువిందు చేస్తున్నాయి. మువ్వన్నెలతో ప్రేక్షకుల గ్యాలరీలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వివిధ దళాల కవాతుకు పరేడ్ ప్రాంగణం సిద్ధం చేయగా, శకటాల ప్రదర్శనకు రహదారి నిర్మించారు. వీవీఐపీ (VVIP), వీఐపీ పార్కింగ్‌కు 15 ఎకరాల్లో, సాధారణ ప్రజలు, రైతుల కోసం మరో 25 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






