Psych Siddhartha: ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “సైక్ సిద్ధార్థ్” మూవీ
నందు, యామినీ భాస్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన “సైక్ సిద్ధార్థ్” సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందే ఈ సినిమాను చూడొచ్చు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీని స్పిరిట్ మీడియా, నందునెస్, కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శ్రీ నందు, రానా దగ్గుబాటి నిర్మించారు. ఈ సినిమాకు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
జనవరి 1న “సైక్ సిద్ధార్థ్” మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఆడియెన్స్ ఎంజాయ్ చేయొచ్చు. “సైక్ సిద్ధార్థ్” సినిమాలో నరసింహ.ఎస్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ రాటకొండ, సాక్షి అత్రి చతుర్వేది, మౌనిక, ద్యుమ్న బిల్లూరి ఇతర పాత్రల్లో నటించారు. సమ్రాన్ సాయి సంగీతాన్ని అందించగా, కె.ప్రకాశ్‌రెడ్డి డీవోపీగా వర్క్ చేశారు.






