Padma Shri: రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ అవార్డులు
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్లతో పాటు, మరణానంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య)లకు పద్మశ్రీ లభించింది.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఓ వైపు చిరంజీవి, బాలయ్య లాంటి బిగ్ స్టార్స్ మాస్ యాక్షన్ సినిమాలు చేస్తుండగా, వారికి పోటీగా కామెడీ ప్రధాన చిత్రాలు చేసి మెప్పించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని అంతర్జీనంగా మేళవిస్తూనే హాస్యాన్ని మెయిన్ గా చేసుకుని సినిమాలు చేసి సక్సెస్? అయ్యారు. నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఆయన నటవైభవానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోలలో మురళీ మోహన్ ఒకరు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ నటుడు, అనేక రంగాల్లో తన టాలెంట్ చూపించారు. హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ సినిమాలు చేసిన మురళీ మోహాన్, ఆతరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వందల సినిమాల్లో నటించి మెప్పించారు. నిర్మాతగా కూడా మారి జయభేరి సంస్థ ద్వారా ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. నటనలోనే కాదు…వ్యాపారరంగంలో కూడా మంచి పేరు గడించారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు.
రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ అవార్డులు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో జరిగే తెలుగు మహాసభల్లో ముఖ్యంగా తానా మహాసభలకు వీరద్దరూ హాజరవుతూ వస్తున్నారు.






