Sky Trailer: ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా ట్రైలర్ రిలీజ్
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న సినిమా “స్కై”. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. “స్కై” సినిమా ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు “స్కై” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య పరిచయం ప్రేమగా మారడం, వారి ప్రేమలోని ఎమోషన్ ఆకట్టుకునేలా చిత్రీకరించారు. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా డిజైన్ చేసినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. హీరో పర్సనల్ లైఫ్ ప్లాష్ బ్యాక్ హార్ట్ టచింగ్ గా ఉంది. కొన్ని అపార్థాలతో హీరో హీరోయిన్ ప్రేమలోనూ కొన్ని విబేధాలు వస్తాయి. ఈ జంట ఎలా తిరిగి ఒక్కటయ్యారు ?, హీరో పర్సనల్ లైఫ్ లో తండ్రితో ఉన్న ప్లాష్ బ్యాక్ ట్రాజెడీ ఏంటి? అనేది తెరపై చూడాలి.






