Minister Jupally: అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఎక్సైజ్ (Excise) సిబ్బందిపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అత్యంత సీరియ్‌సగా తీసుకుంటుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రి (NIMS Hospital)లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Constable Soumya) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో గాయపడిన సౌమ్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






