Medaram: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ.. వనదేవతల వద్ద కిక్కిరిసిన భక్తజనం
వనదేవతల మహా జాతర సందడి రోజురోజుకూ పెరుగుతోంది. ములుగు (Mulugu) జిల్లాలో సమ్మక్క, సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుండడంతో ముందుగానే భక్తులు మేడారం (Medaram) బాట పడుతున్నారు. ఆదివారం వేలల్లో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి ప్రత్యేక వాహనాలు, బస్సుల్లో కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో మేడారంతో పాటు పరిసరాలన్నీ భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. క్యూలైన్లలో బారులుతీరి గద్దెల ప్రాంగణం చేరుకొని బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






