America: అమెరికాలో భారత సంతతి సీఈవో అరెస్ట్

అమెరికాలో వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో భారత సంతతి సీఈఓ (Indian-origin CEO) అరెస్టయ్యారు. క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రేడియంట్ సీఈఓగా పనిచేస్తోన్న అనురాగ్ బాజ్‌పాయ్ (Anurag Bajpayee) ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన క్లైంట్ల జాబితాలో ఆయన పేరు కూడా ఉందని బోస్టన్ ఏరియా కోర్టు (Boston Area Court) కు సమర్పించిన పత్రాల్లో ఉన్నట్లు పేర్కొంది.
వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు చెందిన ప్రత్యేక క్లైంట్ల గ్రూప్‌లో అనురాగ్ పేరు ఉందని విచారణాధికారులు వెల్లడిరచారు. వీరు గంటకు 600 డాలర్లు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. వీరు ఎంచుకునే వారిలో ఆసియా మహిళలు ఉంటారని తెలిపారు. ఆ మహిళలు మానవ అక్రమరవాణా కారణంగా ఈ ఊబిలో చిక్కుకున్నారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో తమ బాస్ పేరు ఉండటంతో గ్రేడియంట్(Gradient) సంస్థ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే సంస్థ మాత్రం అనురాగ్ (Anurag) కు మద్దతు ప్రకటించడంతో పాటు న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.