Chandra Arya: కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయుడు
కెనడా ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన చంద్ర ఆర్యా (Chandra Arya )పోటీ పడనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పదవి నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధానమంత్రి ఎవరన్నది మార్చి 9న ప్రకటించుంది. ప్రధాని పదవి కోసం తాను రంగంలోకి దిగనున్నట్టు ఆర్య ప్రకటించారు. ఒట్టావాలోని నేపియన్ నుంచి ఎంపీగా ఎన్నికైన చంద్ర ఆర్యా కర్ణాటక (Karnataka) లో జన్మించారు. దేశ పునర్నిర్మాణం కోసం, భావి తరాలను సుసంపన్నం చేసేందుకు సామర్థ్యపరంగా గట్టిదే అయినా సంఖ్యాపరంగా చిన్నదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కెనడా తదుపరి ప్రధానమంత్రి పదవికై నేను పోటీ పడబోతున్నాను అని ఆర్యా పేర్కొన్నారు.






