Anita Anand :కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగిన అనితా ఆనంద్
కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగుతున్నట్లు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ (Anita Anand) ప్రకటించారు. ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau )తన పదవికి రాజీనామా చేయన్నుట్లు ప్రకటించిన తర్వాత రేసులో ఉన్న మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అనితా ఇందిరా ఆనంద్ పేరు కూడా ఉంది. అకస్మాత్తుగా ఆమె తన నిర్ణయం మార్చుకున్నారు. ఎంపీ (MP) గా మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. భవిష్యత్తులో బోధనా రంగంలో, పరిశోధనల్లో సేవలు అందించాలనుకుంటు న్నట్లు తెలిపారు. అనిత స్వస్థలం తమిళనాడు (Tamil Nadu)లోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు. ఆమె తాత అన్నాస్వామి సుందరం స్వాతంత్య్ర సమరయోధుడు. అనిత కెనడాలో మొదటి హిందూ మంత్రి.






