Bahamas: బహమాస్‌లో భారత సంతతి విద్యార్థి మృతి
అమెరికాలో చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థి ఒకరు బహమాస్ (Bahamas)లో ప్రమాదవశాత్తు ఓ హోటల్ బాల్కనీ నుండి పడిపోయి మృతి చెందాడు. ఈ దుర్ఘటన అదివారం జరిగింది. ష్రూస్‌బరీకి చెందిన గౌరవ జైసింగ్ (Jaisingh )(25) మసాచుసెట్స్ వాల్తామ్‌లోని బెంట్లీ విశ్వవిద్యాలయం (Bentley University) విద్యార్థి. ఈ వారంలోనే అతడి గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. తన స్నేహితుడులతో కలిసి పర్యటనకు వెళ్లి గౌరవ్ ఓ హాటల్లో బస చేశాడు. హోటల్ బాల్కనీలో తిరుగుతుండగా ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ నెల 17న అండర్ గ్రాడ్యుయేట్ (Undergraduate )కార్యక్రమంలో గౌరవ్‌ను సత్కరించాలనుకున్నాం. ఇంతలోనే అతడి మృతి బాధాకరం. కుటుంబ సభ్యులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం అని బెంట్లీ యూనివర్సిటీ తెలిపింది. అతడి మరణంపై దర్యాప్తు కొనసాగుతుందని అక్కడి అధికారులు తెలిపారు.







