Elon Musk : భారత్-అమెరికా మధ్య సంబంధాల కోసం మద్దతిస్తా : ఎలాన్ మస్క్

భారత్, అమెరికాల మధ్య సంబంధాలు సానుకూల ధోరణిలో ఉన్నాయని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నారు. స్పేస్‌ఎక్స్ స్టార్‌బేస్ స్థావరంలో భారత్‌కు చెందిన వ్యాపారవేత్తలతో మస్క్ సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మస్క్ మాట్లాడుతూ భారత్(India), అమెరికా(America) ల మధ్య మెరుగైన వాణిజ్య సంబంధాలకు తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య సాంకేతికత, అంతరిక్ష అన్వేషణ రంగాలలో సహకారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీ(Technology), ఆవిష్కరణల రంగాల్లో ప్రపంచ దేశాల్లో భారత్ పాత్ర మెరుగవుతోందని అన్నారు.