Retaliatory Tariffs: సుంకాల సమస్యపై అమెరికాతో కొనసాగుతున్న భారత్ చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై ప్రతీకార సుంకాలు (Retaliatory Tariffs) అమలు చేస్తామంటూ చేసిన హెచ్చరికలపై భారత్ చర్యలు మొదలుపెట్టింది. ఈ సుంకాల సమస్య పరిష్కారానికి అమెరికాతో కలిసి ఫ్రేమ్‌వర్క్ రూపొందించేందుకు సంప్రదింపులు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాణిజ్యంపై రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి అవసరమైన చర్యలు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. “ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాణిజ్యాన్ని విస్తరించేందుకు, మార్కెట్ యాక్సెస్‌ను మెరుగుపరిచేందుకు, సుంకాలను తగ్గించేందుకు పని చేస్తున్నాం,” అని జైశ్వాల్ అన్నారు. అయితే, ట్రంప్ (Retaliatory Tariffs) హెచ్చరికల నేపథ్యంలో భారత్ టారిఫ్‌లను తగ్గిస్తుందా అనే ప్రశ్నకు మాత్రం ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కాగా, ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, భారత్ తమ ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తుందని నమ్మకముందన్నారు. అయితే ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాల (Retaliatory Tariffs) అమలు నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన స్పష్టం చేశారు.






