America: అమెరికా టారిఫ్లపై చర్చలే మార్గం : జైశంకర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్లపై ప్రతీకార సుంకాలు విధించాలని పలు దేశాలు భావిస్తుండగా, భారత్ మాత్రం చర్చల మార్గాన్ని ఎంచుకొంది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) వెల్లడిరచారు. ఆయన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) తో ఫోనులో చర్చలు జరిపారు. ఇరు దేశాలు త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు. దీనిపై మరిన్ని సంప్రదింపులు జరపాలని ప్రతిపాదించారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) జరిపిన అమెరికా పర్యటనలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు.







