India : భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్(India), ఇండోనేషియా(Indonesia) నిర్ణయించాయి. ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా ముందుకు వెళ్లేందుకు అంగీకరించాయి. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto), ప్రధాని మోదీ (Modi) మధ్య జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరింది. సుబియాంతో మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఢల్లీిలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న రిపబ్లికన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.