వారిని బలవంతంగా వెనక్కి పంపొద్దు.. భారత్ కు ఐసీజే విజ్ఞప్తి
సరిహద్దుల నుంచి మయన్మార్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపవద్దని భారత్కు అంతర్జాతీయ న్యాయనిపుణుల కమిటి ( ఐసీజే) విజ్ఞప్తి చేసింది. శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం నాన్-రిఫౌల్మెంట్ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. మయన్మార్ నుంచి వచ్చిన 77 మంది శరణార్థులను తమ ప్రభుత్వం వెనక్కి పంపిందని ఇటీవల మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఐసీజే ఈ విజ్ఞప్తి చేసింది. కలహాలతో నిండి ఉన్న దేశాల నుంచి వస్తున్న శరణార్తులను వెనక్కి పంపడానికి బదులుగా భద్రతను కోరుకునే వారికి రక్షణ, మద్దతును అందించాలని తెలిపింది. అలాగే మయన్మార్ శరణార్థులపై వివక్ష, శత్రుత్వం లేదా హింసను ప్రేరేపించడం కూడా ఆపివేయాలని లేదా నిషేధించాలని కోరింది.






