America Miss: నేషనల్ అమెరికా మిస్ గా తెలుగు అమ్మాయి
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో హైదరాబాద్ నగరానికి చెందిన తెలుగు అమ్మాయి హన్సిక నసనల్లి (Hansika Nasanalli) సత్తాచాటి విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు. హన్సిక రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో సైతం విజేతగా నిలిచారు. అదేవిధంగా అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డు (Academic Achievement Winner Award) ను కూడా కైవసం చేసుకున్నారు. ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ నాలుగుసార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికా మిస్, ఇంటర్నేషనల్ జా.విమస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తాచాటారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు ఆమె తెలిపారు.






