ఆయన బతికే ఉన్నారు… సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. చైనా సీనియర్ చట్టసభ సభ్యురాలు ఓయున్ కెమాగ్(81) అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అధ్యక్షుడు జిన్పింగ్, ఇతర నాయకుల మధ్య వే ఫంగ్హా నివాళులర్పించడం సీసీటీవీ కథనంలో కనిపించింది. దీంతో చైనా ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ముప్పూ లేదని స్పష్టమవుతోంది. చైనా క్షిపణి దళం ఇప్పటి పీఎల్ఏ రాకెట్ ఫోర్స్లో ఆయన సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేశాడు. ఫంగ్హా గతేడాది అక్టోబరు నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే.






