Elon Musk :మరోసారి సంపన్నుల జాబితాలో మస్కే నంబర్ వన్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి సంపన్నుల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ (Forbes) సంస్థ విడుదల ఏసిన సంపన్నుల జాబితా 2025 లో ముందువరుసలో ఉన్నారు. 342 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆయన అగ్రస్థానం దక్కించుకున్నారు. గతేడాది పోలిస్తే మస్క్ సంపద 147 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రపంచ కుబేరుడు మస్క్‌కు టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్‌గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా, భారత్‌లో 205 మంది ఉన్నారు. ప్రముఖ భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో 18వ స్థానంలో నిలిచారు. ఆసియాలో అత్యంత సంపన్న భారతీయుడిగా కొనసాగుతున్నారు. మరో భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) 56.3 బిలియన్ డాలర్ల సంపదతో 28వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైన నాలుగో వ్యక్తి, దేశంలో అత్యంత ధనవంతుడైన రెండో వ్యక్తిగా నిలిచారు. చైనాకు చెందిన జాంగ్ యిమింగ్ (Zhang Yiming) 65.5 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలోని బిలియనీర్లలో 23వ స్థానం దక్కించుకోగా అదే దేశానికి చెందిన జాంగ్ షాన్షాన్ 57.7 బిలియన్ డాలర్లతో 26వ స్థానంలో ఉన్నారు.