America: వాణిజ్య ఒప్పందంపై నేడు అమెరికాతో చర్చలు

భారత్(India)-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సోమవారం వాషింగ్టన్ (Washington) లో చర్చలు జరుగుతున్నాయి. భారత్ తరఫున వాణిజ్య మంత్రి గోయల్ (Goyal) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ప్రాతినిధ్యం వహించనుంది. భారత్-అమెరికా (America) ల మధ్య ఇప్పటికే ఉన్న పలు సమస్యలతో పాటు తాజాగా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని గోయల్ అభిప్రాయపడ్డారు. సానుకూల ఫలితాలు రావాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. సంప్రదింపులు కొసాగుతున్నాయి. దీనిని ఓ సందర్భంగా భావిస్తున్నామే తప్ప, ఘర్షణగా పరిగణించడం లేదు అని తెలిపారు.