America: అమెరికా విమాన టికెట్లను కావాలనే బ్లాక్ చేశారా?

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతుదారుల బృందమైన మాగా ( మేక్ అమెరికా గ్రేట్ అగైన్) ఆన్‌లైన్ ఫోరమ్ 4చాన్ ఆందోళనలో ఉన్న భారతీయ హెచ్1బీ (H1B) వీసాదారులను ఇబ్బందిపెట్టేందుకు యత్నించాయి. ఇందుకోసం క్లాగ్ ది టాయిలెట్ పేరిట ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం హెచ్1బీ వీసాల కొత్త నిబంధన అమల్లోకి రానుండటంతో చాలా కంపెనీలు ఇతర దేశాల్లోని తమ హెచ్1బీ వీసా ఉద్యోగులను తక్షమే బయల్దేరి అమెరికా వచ్చేయాలని కోరాయి. ఈ రకం వీసాదారుల్లో ఎక్కువ మంది భారతీయులు (Indians) ఉన్నారు. స్వదేశం నుంచి అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్ల కోసం ఇబ్బండి పడ్డారు. దీంతో వాటి ధరలు రూ.40 వేల నుంచి 80 వేలకు చేరుకున్నాయి.