GTRI: భారతదేశం కంటే అమెరికాకే ఎక్కువ నష్టం : జీటీఆర్‌ఐ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్-1బీ కొత్త వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారతదేశం కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగిస్తుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ ( జీటీఆర్‌ఐ) పేర్కొంది. భారతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే అమెరికాలో 50-80 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాయని పేర్కొంది. మొత్తం మీద సుమారు లక్ష మంది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాయని తెలిపింది. ప్రస్తుతం అమెరికన్లతో పోలిస్తే భారత్ (India) నుంచి తీసుకెళ్లిన నిపుణులకు తక్కువ వేతనాలే లభిస్తున్నాయని వివరింంచింది. తాజాగా పెంచిన రుసుము వల్ల అమెరికాలో స్థానికుల కంటే, భారత్ నుంచి తీసుకెళ్లే వారి కోసం కంపెనీలు అధికంగా ఖర్చు చేయాల్ని వస్తుందని పేర్కొంది. అందువల్ల కంపెనీలు అమెరికా నుంచి ప్రాజెక్టుల పనిని స్వదేశాలకు తరలించడం పెరగొచ్చని, దీంతో తక్కువ హెచ్`1బీ పిటిషన్లు, తక్కువ స్థానిక నియామకాలు జరగొచ్చని అంచనా వేసింది. ఒకవేళ అమెరికా నుంచి ప్రాజెక్టులను తరలిచండంపై ఆంక్షలుపెడితే, అక్కడే నియామకాలు జరుపుతాయని, అయితే యూఎస్ క్లయింట్లకు ప్రాజెక్ట్ ఖర్ఛులు అధిక మవుతాయని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ వెల్లడిరచారు.