Chandrababu: ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే : చంద్రబాబు

సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్ని అయినా చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో 28వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును సీఎం ప్రారంభించారు. డిజిటల్ ఏపీ సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నాయకుడిగా ప్రధాని మోదీ (Modi) వచ్చారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా మనమూ మారాల్సిన అవసరముంది. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్‌లైన్ (Online) లో అందుబాటులోకి వచ్చాయి. ఐటీ రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే హైదరాబాద్ (Hyderabad) కు మేలు జరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారింది. ఇవాళ ప్రపచంలో ఎక్కడ చూసిన భారతీయులే ఉన్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీ వారే. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్‌కు చెందినవారు ఉన్నారు. భారతీయ ఐటీ నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారే కావడం విశేషం. ప్రముఖ సంస్థల సహకారంతోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థలు వస్తున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నాం అని తెలిపారు.