Athletics: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికాదే ఆధిపత్యం

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టోక్యో (Tokyo) ఛాంపియన్‌షిప్‌ను ఆ దేశం అగ్రస్థానం (26 పతకాలు)తో ముగించింది. ఇందులో 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్వాలు ఉన్నాయి. చివరి రోజు, ఆదివారం 4 100 మీటర్ల రిలేలో అమెరికా (America) డబుల్ సాధించింది. 4 400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలోనూ పసిడి సైతం అమెరికా ఖాతాలోనే చేరింది. మహిళల టీమ్‌లో షెరికా రిచర్డ్‌సన్, మెలిసా జెఫర్సన్, పురుషుల్లో నోవా లైల్స్, కోల్‌మన్ అమెరికా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. కెన్యా 11 పతకాలు ( 7 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు), కెనడా 5 ( 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం), రెండు మూడో స్థానాలు దక్కించుకున్నాయి.