Canada :ట్రూడో నిష్క్రమణతో కెనడా వీసాలపై ప్రభావం!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తన పదవికీ రాజీనామా చేస్తానని ప్రకటించిన దరిమిలా కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో ఆ దేశ వీసాల (visa) పై తీవ్ర ప్రభావం పడనుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ట్రూడో హయాంలో 2015-23 మధ్య అంతరాజతీయ విద్యార్థులు, ముఖ్యంగా భారత విద్యార్థుల (Indian students ) కు వీసాల విషయంలో స్వర్ణ యుగమని తెలిపారు. స్వేచ్ఛాయుత వలస విధానాలను ఆయన అమలు చేశారని, దీంతో భారత విద్యార్థులు అధికంగా లబ్ధి పొందారని చెబుతున్నారు. 2015-24 మధ్య కాలంలో 13 లక్షల మంది భారత విద్యార్థులు చదువుకు సంబంధించిన అనుమతులు పొందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క 2015లోనే 31,920 మంది భారత విద్యార్థులు ఈ అనుమతులు పొందారు. ఇది మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 14 శాతంగా ఉంది.






