America : అమెరికాకు యూరోపియన్ యూనియన్ దేశాలు షాక్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పరస్పర టారిఫ్లు విధించారు. ఐరోపా (Europe) దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు- అల్యూమినియం పై సుమారు 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యూరోపియన్ యూరోపియన్ (European European) దేశాలు కీలక సమావేశం ఏర్పాటు చేశాయి. చర్చల అనంతరం యూఎస్ వస్తువులపై 23 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలను విధించడానికి ఆమోదం తెలిపాయి. 27 దేశాలు ఈ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి వస్తాయని వెల్లడిరచారు. అయితే, ఎలాంటి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు (Tariffs) విధిస్తారు అనేది మాత్రం బయటకు చెప్పలేదు.







