Musks Father : నా కుమరుడు చెప్పేవి పట్టించుకోవద్దు మస్క్ తండ్రి కీలక వ్యాఖ్యలు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ (Erral Musk ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎలాన్ చెప్పేది వినాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో అతడో మామూలు మనిషి. అతడు సంపన్నుడు కాబట్టి అతను చెప్పిన విషయాన్ని అనేకమంది స్పందిస్తారు. ఎలాన్ చెప్పేవన్నీ పట్టించుకోవద్దు అని ఎర్రల్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్(Elon Musk ) కు ఆయన తండ్రి ఎర్రల్ మస్క్‌కు మధ్య తీవ్రమైన అభిప్రాయబేధాలున్నాయి. గతంలో విడుదలైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో రచయిత ఐజాక్సన్ (I Jackson) ఈ విషయాన్ని వెల్లడిరచారు.






