పంతం నెగ్గించుకున్న డొనాల్డ్ ట్రంప్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతగా ఓ సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ను ఏర్పాటు చేసుకున్నారు. ట్రంప్‍పై ఫేస్‍బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా సైట్లు నిషేధం విధించిన సంగతి తెలుసు కదా. ఇక లాభం లేదనుకొని తానే సొంతంగా ఓ కమ్యూనికేషన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. దీని పేరు ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జే ట్రంప్. www.DonaldJTrump.com/desk యూఆర్‍ఎల్‍లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ట్రంప్ మాత్రమే ఏదైనా పోస్ట్ చేయగలరు. ఇది ఇంచుమించు ట్విటర్‍లాగే కనిపిస్తోంది. తన అభిప్రాయాలను దీని ద్వారా అభిమానులతో ట్రంప్ పంచుకోనున్నారు. కాకపోతే ఇది కేవలం వన్ వే కమ్యూనికేషనే. అంటే ట్రంప్ మాత్రమే పోస్ట్ చేయగలరు. ఆయన అభిమానులు కేవలం వీటిని చూడగలరు తప్ప రిప్లై ఇవ్వలేరు. సేవ్ అమెరికా పేరుతో లోగోను తయారు చేశారు. అమెరికా మళ్లీ గొప్ప దేశంగా చేయగలమని విశ్వసిస్తున్నాం అని ఈ వెబ్‍సైట్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ లోగో డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది.