DHL: అమెరికాకు కొన్ని రకాల కొరియర్ సేవలు నిలిపేసిన డీహెచ్ఎల్
జర్మనీకి చెందిన కొరియర్ సేవల దిగ్గజం డీహెచ్ఎల్ (DHL) 800 డాలర్ల కంటే విలువైన ప్యాకేజీలను అమెరికా (America )లో డెలివరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు (Tariffs), చెకింగ్లు కఠినం కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడిరచింది. బీ2బీ ( బిజినెస్ టు బిజినెస్) షిప్మెంట్లు యథావిధిగా కొనసాగినా, ఆలస్యం కావొచ్చని వెల్లడిరచింది. గతంలో ప్యాకేజీల 2,500 డాలర్ల వరకు విలువైన ప్యాకేజీలను అతి తక్కువ పేపర్ వర్క్‌తో అమెరికాలో డెలివరీ చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం 800 డాలర్ల కంటే తక్కువ విలువైన వాటిని మాత్రమే అమెరికాకు డెలివరీ చేస్తోంది. ముఖ్యంగా చైనా(China), హాంకాంగ్ (Hong Kong) నుంచి వచ్చే కొరియర్ల విషయంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. సింథటిక్ డ్రగ్స్ (Synthetic drugs)ను అమెరికాలో సరఫరా చేయడానికి చైనా కొరియర్ మార్గాలను వాడుకొంటున్నట్లు ట్రంప్ కార్యవర్గం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో పంపిణి వ్యవస్థను అడ్డుకోవాలని అధికారులకు సూచించింది. గత వారం హాంకాంగ్ పోస్టు కూడా అమెరికాకు సముద్ర మార్గంలో ప్యాకేజీల సరఫరాను ఏప్రిల్ 27 నుంచి పంపడం ఆపేస్తున్నట్లు వెల్లడిరచింది. అమెరికాకు పార్సిళ్లను ఇక తీసుకోమన్నారు. అమెరికా ఆకారణంగా వేదిస్తోందని ఆరోపించింది.







