లోక్ సభ అభ్యర్థులకు మద్దతుగా దుబాయ్ లో …కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో లోక్‌సభ పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ దుబాయ్‌లో కాంగ్రస్ తరపున నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. నగరంలోని వివిధ కార్మిక క్యాంప్‌లలో లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా, కాంగ్రెస్ ఎన్నారై సెల్ యూఏఈ అధ్యక్షుడు ఎస్వీ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. బర్ దుబాయ్, అల్ ఘెసెస్లతో పాటు సోనాపూర్, జబల్ అలీలోని లేబర్ క్యాంప్‌లలో ఉంటున్న వేలాది మంది తెలంగాణ ప్రవాసీలను కాంగ్రెస్ కార్యకర్తలు కలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని స్వదేశంతోని కటుంబ సభ్యులకు సూచించాలని కోరుతున్నారు. దుబాయ్, షార్జాతో పాటు ఇతర ఎమిరేట్లలోనూ ప్రచారాన్ని ముమ్మరం చేశామని ఎస్వీ రెడ్డి తెలిపారు. ప్రవాసీల సమగ్ర సంక్షేమం కోసం గల్ఫ్ పాలసీని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన గల్ఫ్‌లోని తెలంగాణ ప్రవాసీలలో గణనీయమైన ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.






