China : వాణిజ్య యుద్ధానికి భయపడేదే లేదు : చైనా
అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడే ప్రసక్తే లేదని చైనా(China) స్పష్టం చేసింది. అదే సమయంలో ట్రంప్ (Trump) ప్రభుత్వంతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. చర్చలకు సంబంధించిన బంతి చైనా కోర్టు (Court)లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో చైనా ఇలా స్పందించింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అమెరికా కోరుకుంటే, తమపై చేస్తున్న ఒత్తిడిని వెంటనే ఆపాలి. బెదిరింపులు, బ్లాక్మెయిల్ (blackmail) చేయడం మానేయాలి. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చైనాతో చర్చలు జరపాలి అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ (Lin Jian) పేర్కొన్నారు.







