Boeing :బోయింగ్ కు చైనా మరో షాక్
అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే బీజింగ్ అరుదైన ఖనిజాలు (Minerals), మాగ్నెట్ (Magnet)ల ఎగుమతులను నిలిపివేసి వాషింగ్టన్ను దెబ్బకొట్టగా, తాజాగా మరో షాక్ ఇచ్చింది. అమెరికా వైమానిక రంగం దిగ్గజమైన బోయింగ్ (Boeing) నుంచి ఎటువంటి డెలివరీలు స్వీకరించవద్దని స్వదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. అదే సమయంలో వైమానిక రంగంలో వినియోగించే విడిభాగాలను అమెరికా (America) నుంచి కొనుగోళ్లు చేయవద్దని సూచించింది. అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ ఇటీవల ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా (China) సంస్థలకు భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.







