China : భారతీయులకు 85 వేల వీసాలు : చైనా
సరిహద్దు విషయంలో భారత్-చైనా(China) మధ్య ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తుంటుంది. అయితే ఇటీవల ఆ వైఖరిలో మార్పు వస్తున్నట్లు స్పష్టమవుతోంది. భారత్ (India) వైపు చైనా స్నేహహస్తాన్ని చాస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పర్యటకులను ఆకట్టుకునేలా మరీ ముఖ్యంగా తమ దేశంలో భారతపౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగా ఏప్రిల్ 9 వరకు 85 వేల వీసాలు(Visas) జారీ చేసింది. ఈ మేరకు మనదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్(Xu Feihong) వెల్లడిరచారు. భారత్లోని చైనా ఎంబసీ, కాన్సులేట్లు ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు భారతీయుల (Indians)కు 85వేలకు పైగా వీసాలు జారీ చేశాయి. చైనాను సందర్శించడానికి మరింతమంది భారత స్నేహితులకు స్వాగతం. సురక్షిత, స్నేహపూర్వక, స్పూర్తివంతమైన చైనాను అన్వేషించండి అని ఫీహంగ్ వెల్లడిరచారు. ఈ ఏడాది ప్రారంభంలో వీసా ధరలపై తగ్గింపును డ్రాగన్ మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబరు 31 వరకు వీసా ఫీజుల (Visa fees) తగ్గింపు కొనసాగుతుందని వెల్లడిరచింది.







