Trudeau :వైదొలగుతున్నా .. కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన
ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ ఇటీవల కాలంలో భారత్ (India)పై తీవ్ర విమర్శలు గుప్పించిన జస్టిస్ ట్రూడో(Trudeau) కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచీ వైదొలగనున్నట్లు తెలిపారు. తన వారసుడిని పార్టీ ఎంపికచేసే వరకూ పదవిలో కొనసాగుతానని సృష్టీకరించారు. పార్టీ పదవితో పాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ(Mark Carney) , లీ బ్లాంక్ (Lee Blanc) లలో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందని వెల్లడిరచారు.






